ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ

ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ
  • ట్రాన్స్​ఫార్మర్ అప్రూవల్​కు రూ.50 వేలు లంచం డిమాండ్

గచ్చిబౌలి, వెలుగు: కొత్త ట్రాన్స్​ఫార్మర్​అప్రూవల్​ఇచ్చేందుకు గచ్చిబౌలి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ)​ రూ.50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల పక్రారం.. సైబర్​సిటీ సర్కిల్​గచ్చిబౌలి సబ్​డివిజన్ టీజీఎస్​పీడీసీఎల్ ఆపరేషన్స్​లో కొట్టె సతీశ్(43) అసిస్టెంట్​ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

ఈ డివిజన్​పరిధిలో కొత్తగా నిర్మించిన అపార్ట్​మెంట్​కు ట్రాన్స్​ఫార్మర్​తోపాటు ఆపరేటెడ్​మీటర్ అప్రూవ్​చేయాలని యజమాని అప్లికేషన్​పెట్టుకున్నాడు. ఏఈ అప్రూవ్ చేసి ఫైల్​ను ఏడీఈ సతీశ్​వద్దకు పంపాడు. అయితే ట్రాన్స్​ఫార్మర్​అప్రూవ్​చేయాలంటే రూ.75 వేలు లంచం డిమాండ్​చేశాడు. దీంతో ఓనర్ ముందుగా రూ.25 వేలు ఇచ్చాడు.

మిగిలిన రూ.50 వేలు కూడా ఇవ్వాలని సతీశ్​డిమాండ్​చేయగా అపార్ట్​మెంట్​ఓనర్​ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం ఏడీఈ సతీశ్ అపార్ట్​మెంట్​ఓనర్​నుంచి రూ.50 వేలు లంచం తీసుకోగా, అదే సమయంలో ఏసీబీ ఆఫీసర్లు రైడ్​చేసి రెడ్​హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, ఏడీఈ సతీశ్​నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.