
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 21న ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పీఎస్ లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా సీఐ సతీష్ కుమార్, ఆయన అనుచరుడు ఓ తెలుగు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఓ భూమి సెటిల్ మెంట్ విషయంలో ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.15 లక్షల వరకు డిమాండ్ చేశాడు మణుగూరు సీఐ సతీష్ కుమార్. 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా ముందుగా రూ. లక్ష పీఎస్ లో సీఐ అనుచరుడికి(జర్నలిస్ట్ ) ఇస్తుండగా.. ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ టీవీ ఛానల్ జర్నలిస్ట్ తో పాటు స్టేషన్ సీఐ ఫోన్లను తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.