ఏసీబీకి చిక్కిన GHMC టాక్స్ ఇన్స్పెక్టర్

ఏసీబీకి చిక్కిన GHMC టాక్స్ ఇన్స్పెక్టర్

15 వేలు లంచం తీసుకుంటుండగా  ఏసీబీకి చిక్కాడు శేరిలింగంపల్లి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యాదయ్య. శేరిలింగంపల్లి జీహెచ్ ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బిల్డింగ్ అనుమతి కోసం రూ. 15 వేలు తీసుకుంటుండగా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యాదయ్యను అతని పర్సనల్ అసిస్టెంట్ సాయిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

శేరిలింగంపల్లి బాపునగర్ లో ఎజాజ్ ఖాన్ అనే వ్యక్తి బిల్డిం‌గ్‌కి సంబందించి టాక్స్ అస్సెస్మెంట్ ఫీజును తక్కువ చేయడానికి రూ. 30 వేల లంచం డిమాండ్ చేశారు టాక్స్ ఇన్స్పెక్టర్ యాదయ్య. దీంతో ఎజాజ్ ఖాన్ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ వేసిన ఏసీబీ అధికారులు రూ.15 వేలు తీసుకుంటుండగా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యాదయ్య, అతని అసిస్టెంట్ సాయిని పట్లుకున్నారు.