దుబ్బాక ఎమ్మార్వో ఆఫీస్లో పనికి.. సిద్ధిపేట టీ షాప్లో లంచం.. లక్ష తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు..!

దుబ్బాక ఎమ్మార్వో ఆఫీస్లో పనికి.. సిద్ధిపేట టీ షాప్లో లంచం.. లక్ష తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు..!

ఏసీబీ అధికారులు ఎంత మంది అవినీతి అధికారులను పట్టుకుంటున్నా.. కొందరికి మాత్రం ఇంకా కనువిప్పు కలగటం లేదు. ఎక్కడో పట్టుకుంటున్నారు.. మనం దొరకం లే.. అన్నంత ధీమాగా టేబుల్ కింద చేతులు పెడుతూనే ఉన్నారు.

తాజాగా సిద్ధిపేట జిల్లాలో మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. దుబ్బాక  తహసీల్దార్ కార్యాలయంలో  ఆర్ఐ గా పని చేస్తున్న నర్సింహా రెడ్డి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 

Also Read :- ఏ క్షణమైనా.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ !

పట్టా పాస్ బుక్ లో పేరు మార్పు కోసం మహిళ రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. అందుకోసం సిద్ధిపేట టీ షాప్ లో సిట్టింగ్ అరేంజ్ చేశాడు. దుబ్బాకలో అయితే ఎవరికైనా డౌట్ రావచ్చునని సిద్ధిపేటలో డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేశాడు. టీ షాప్ లో మహిళా రైతు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి  పట్టుబడ్డాడు. ముందు నుంచే నిఘా ఉంచి ఏఐని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.