లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన తండ్రీ కొడుకులు

  • బెనిఫిట్స్​ కోసం రూ.30 వేలు డిమాండ్​ చేసిన లేబర్ ​ఆఫీసర్​
  • రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన కొడుకు

నిర్మల్, వెలుగు : లేబర్​ ఆఫీసరైన తండ్రి బెనిఫిట్స్​ ఇప్పించడానికి లంచం డిమాండ్ ​చేయగా.. ఆ డబ్బులను తీసుకుంటూ కొడుకు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి కథనం ప్రకారం..నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ లో సహాయ కార్మిక శాఖ అధికారి కె.సాయిబాబా ఉంటున్నాడు. కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన గంగన్న తల్లి రిజిస్టర్డ్ లేబర్ కాగా, ఈ మధ్యే చనిపోయింది.

ఆమెకు రూ.లక్ష 30 వేల బెనిఫిట్స్​ రావాల్సి ఉండగా, ఫైల్ ను జిల్లా కార్మిక శాఖ అధికారికి పంపేందుకు సహాయ కార్మిక శాఖ అధికారిసాయిబాబా రూ.30 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని గంగన్న ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. సోమవారం సాయిబాబా ఇంట్లో ఆయన కొడుకు దామోదర్ ..

గంగన్న నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంట్లోనే ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబాతోపాటు దామోదర్​ను కరీంనగర్​లోని సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.