- రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సూర్యాపేట ఆఫీసర్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని ఓ చెరువులో చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్స్య శాఖ అధికారి ఠాకూర్ రూపిందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూపిందర్ సూర్యాపేటకు వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సూర్యాపేట మత్స్య సహకార సంఘం పరిధిలోని చెరువులో చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం కోసం రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో సహకార సంఘం సభ్యులు ఏసీబీని ఆశ్రయించారు. సూర్యాపేటలోని ఆయన ఇంట్లో శుక్రవారం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్లో పని చేసే టైంలోనూ ఏసీబీకి దొరికిన రూపిందర్, తాజాగా ఇప్పుడు రెండో సారి చిక్కారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ తెలిపారు. ఏసీబీ డీఎస్పీతో పాటు ఏసీబీ ఎస్సై రామారావు, సిబ్బంది ఉన్నారు.