- రూ. 1.14 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు
పాల్వంచ, వెలుగు : డ్రిప్ ఇరిగేషన్ కోసం లంచం తీసుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం సెరికల్చర్, హార్చికల్చర్ జిల్లా ఆఫీసర్‌ను బుధవారం ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా సెరికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్‌గా కె.సూర్యానారాయణ పనిచేస్తున్నాడు. ఇతడు మహబూబాబాద్ జిల్లా ఆఫీసర్‌గా పనిచేసిన టైంలో అక్కడ డ్రిప్ ఇన్స్‌స్టాలేషన్ కోసం ఓ కంపెనీ నుంచి రూ. 85 వేలు డిమాండ్ చేశారు. తర్వాత భద్రాద్రి జిల్లా ఆఫీసర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
ఇక్కడ కూడా డ్రిప్ ఇన్స్‌స్టాలేషన్ కోసం రూ. 29 వేలు ఇవ్వాలని అదే కంపెనీని డిమాండ్ చేశాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించారు. వారి సూచనతో కంపెనీ ప్రతినిధులు మొత్తం రూ. 1.14 లక్షలను బుధవారం కలెక్టరేట్‌లో సెరికల్చర్, హార్టికల్చర్ ఆఫీస్‌లో సూర్యానారాయణకు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సూర్యానారాయణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.