ఏసీబీకి చిక్కిన మేడ్చల్​ ఏఎస్సై

ఏసీబీకి చిక్కిన మేడ్చల్​ ఏఎస్సై

మేడ్చల్, వెలుగు: ఓ కేసు విచారణలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ మేడ్చల్​ఏఎస్సై మధుసూదన్ రావు ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌడవల్లిలో నిర్మిస్తున్న సాకేత్ ప్రణామ్ విల్లాస్ లో ఇంటీరియర్ డిజైనింగ్​పనులు చేపట్టిన విశ్వనాథ్​అనే వ్యక్తిపై ఓ ఇంటి యజమాని కేసు పెట్టారు. డబ్బు తీసుకుని ఒప్పుకున్న పనులు చేయకపోవడంతో మేడ్చల్​పోలీసులను ఆశ్రయించాడు.

విచారణ చేపట్టిన ఏఎస్సై మధుసూదన్ విశ్వనాథ్​ను రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. మొదట రూ.10 వేలు ఇచ్చిన విశ్వనాథ్.. ​తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం  బాధితుడి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏఎస్సై మధుసూదన్​ను ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.