ఈఎన్టీ దవాఖానలో అవినీతి చేప వలపన్ని పట్టుకున్న ఏసీబీ

ఈఎన్టీ దవాఖానలో అవినీతి చేప వలపన్ని పట్టుకున్న ఏసీబీ

బషీర్ బాగ్, వెలుగు: కోఠి ఈఎన్టీ హాస్పిటల్​లో సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ రెడ్​హ్యాండెడ్​గా ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల ఫైల్ ప్రాసెస్ చేయడానికి బాధిత వ్యక్తి నుంచి సంతోష్ తివారీ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

తొలుత రూ.17 వేలు తీసుకున్న సంతోశ్ తివారీ శుక్రవారం మరో మూడు వేలు తీసుకుంటుండంగా రెడ్ హ్యాండెడ్ గా వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్ట్ జడ్జి ముందు హాజరు పరిచి రిమాండ్​కు తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.