రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

సూర్యాపేట జిల్లాలో రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి. స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్లోనే లంచం తీసుకుంటుండగా మంగళవారం ( ఏప్రిల్ 8 ) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 

గతంలో పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా 23 అక్టోబర్  2024లో ఆరుగురు పైన కేసు నమోదు చేయగా.. స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై రూ. 15వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ ని ఆశ్రయించిన నిందితులు.

ఇవాళ స్టేషన్ లోనే రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఎస్సై అంతిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం ఆశిస్తే ఏసీబీ ని ఆశ్రయించాలని సూచించిన ఏసీబీ అధికారులు.