లంచంతో దొరికిన కరెంట్ ఆఫీస్ టెక్నికల్ డివిజన్ ఇంజినీర్

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ పరిధిలోని ఆపరేషన్స్ విభాగం కింద ఉన్న సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలోనే.. టెక్నికల్ డివిజన్ ఇంజినీర్ రామ్మోహన్ నాయుడు లంచం తీసుకుంటూ దొరికారు. 

ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన 2 ఫైల్స్ మూవ్ చేయటానికి 18 వేల లంచం డిమాండ్ చేశాడు రామ్మోహన్ నాయుడు. అతను ఏసీబీని ఆశ్రయించగా.. వల వేసి డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఆఫీసులోనే 18 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల పన్ని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.