రూ.3 లక్షల లంచం: ఏసీబీకి అడ్డంగా దొరికిన మెడికల్ కళాశాల ఏవో, జూనియర్ అసిస్టెంట్

రూ.3 లక్షల లంచం: ఏసీబీకి అడ్డంగా దొరికిన మెడికల్ కళాశాల ఏవో, జూనియర్ అసిస్టెంట్

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో అవినీతి అధికారులపై యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. వివిధ పనులు కోసం వచ్చే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా లంచాలు దండుకుంటున్న అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టి రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకుని కటకటాల వెనక్కి నెడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం (అక్టోబర్ 29) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఇద్దరు అవినీతి అధికారులు అడ్డంగా బుక్క్ అయ్యారు. కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాల ఏవో ఖలీలుల్ల, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి నుండి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పి వై.రమేష్ రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.