వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు

వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరుకులు నిల్వచేసే గోదాం, అకౌంట్స్​, లడ్డూ తయారీ విభాగాలను పరిశీలించడంతో పాటు అకౌంట్స్, తూనికలు, కొలతలు, వసతి గదుల రికార్డులను చెక్​చేశారు. గోదాంలోని సరుకుల శాంపిల్స్, ప్రసాదాల తయారీలో వాడే సరుకుల శాంపిళ్లను తీసుకున్నారు. 

ఇటీవలే రాజన్న ఆలయం నుంచి చాలా మంది రాష్ర్టంలోని ఇతర ఆలయాలకు బదిలీ  అయ్యారు. ఆలయానికి కూడా 28 మంది వచ్చారు. ఈ క్రమంలో ఏసీబీ తనిఖీలు చేయడంతో కంగారు పడ్డారు.