రాజన్న ఆలయంలో నెయ్యి, జీడిపప్పు వివరాల్లో తేడాలు

రాజన్న ఆలయంలో నెయ్యి, జీడిపప్పు వివరాల్లో తేడాలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలోని నెయ్యి, జీడిపప్పు వివరాల్లో భారీ తేడాను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు శనివారం ‘X’​ లో పోస్ట్​ చేశారు. ఆలయంలోని ప్రధాన విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న భక్తుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. గురువారం సరుకుల గోడౌన్, అకౌంట్స్, లడ్డూ తయారీ, తూనికలు, కొలతలు, వసతి గదుల రికార్డ్స్ పరిశీలించారు. 

శుక్రవారం పలు టెండర్లు, అన్నదానం విభాగాల్లో విచారణ చేపట్టారు. నెయ్యి, జీడిపప్పు,  నూనెకి సంబంధించిన వివరాల్లో భారీగా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. భక్తుల నుంచికల్యాణకట్టలో రూ.50- నుంచి  రూ.100  వసూలుపై వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ ఆమోదం లేకుండా పాత టెండర్లతోనే సామగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే  ఇటీవల ఆలయ జూనియర్​అసిస్టెంట్​నుంచి ఏఈవో వరకు బదిలీ అయ్యారు. ఇటీవల 28 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు.