HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబి కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. శివబాల కృష్ణ బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు మరోసారి కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ  అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివబాలకృష్ణ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు . 8 రోజుల పాటు విచారించారు. 250 కోట్ల మేర శివ బాలకృష్ణ అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులుగుర్తించారు. 214 ఎకరాల ఆస్తి పత్రాలను గుర్తించారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని శివబాలకృష్ణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 24న నాంపల్లి ఏసీబీ కోర్టు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.. తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు.