సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ సందర్భంగా పాస్ పోర్టును కోర్టుకు అప్పగించారు రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతి సారీ కోర్టు అనుమతి తీసుకుంటున్నారు.
బ్రిస్బేన్, దావోస్ ,ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆరు నెలలు పాస్ పోర్టు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థనను ఏసీబీ కోర్టు అంగీకరించింది . 2025, జులై 6లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ALSO READ| ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు