నకిలీ ఏసీబీ కాల్స్‌‌తో జాగ్రత్త : ఏసీబీ డీజీ విజయ్‌‌ కుమార్‌‌‌‌

నకిలీ ఏసీబీ కాల్స్‌‌తో జాగ్రత్త :  ఏసీబీ డీజీ విజయ్‌‌ కుమార్‌‌‌‌
  • అలాంటి ఫోన్స్‌‌ వస్తే 1064కి ఫిర్యాదు చేయండి

హైదరాబాద్, వెలుగు: నకిలీ ఏసీబీ కాల్స్‌‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏసీబీ డీజీ విజయ్‌‌ కుమార్‌‌‌‌ సూచించారు. ఏసీబీ అధికారులు ఎవ్వరూ ఫోన్‌‌ కాల్స్‌‌ చేయరని స్పష్టం చేశారు. యాంటీ కరెప్షన్‌‌ బ్యూరో (ఏసీబీ) పేరుతో ప్రైవేటు వ్యక్తులు ఫోన్‌‌ కాల్స్‌‌ చేసి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. 

మీపై ఏసీబీ కేసులు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అలాటి ఫోన్స్​వస్తే ఏసీబీ టోల్‌‌ఫ్రీ నంబర్‌‌ 1064కు లేదా స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్‌‌ నంబర్‌‌ 9440446106, ఫేస్‌‌బుక్‌‌లో Telangana ACBలో లేదా ‘ఎక్స్‌‌’లో @TelanganaACBలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.