హైడ్రా పేరు చెప్పి డబ్బులు అడిగితే.. ఈ నంబర్ కు కంప్లైంట్ చేయండి

హైడ్రా పేరు చెప్పి  డబ్బులు అడిగితే.. ఈ నంబర్ కు కంప్లైంట్ చేయండి

హైడ్రా పేరు చెప్పి వసూళ్లూ చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ హెచ్చరించింది.  ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.  హైడ్రా పేరు చెప్పి డబ్బులు డిమాండ్  చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించింది.   డబ్బులు వసూలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని సూచించింది.  ఇన్‌ ఫార్మర్ల పేర్లు గోప్యంగా ఉంచుతామని  తెలిపింది ఏసీబీ. 

  హైడ్రా పేరుతో మీ బిల్డింగులు కూల్చివేస్తారని.. మీ ఇల్లు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో పోతందని భయపెట్టి డబ్బూలు వసూలు చేస్తే నేరుగా హైడ్రాకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీసులు  సూచించారు.

ALSO READ | సీఎ రేవంత్ భేష్.. హైడ్రా ఉండాల్సిందే: పవన్ కళ్యాణ్

 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి  హైడ్రా కమిషనర్ తనకు బాగా తెలుసని.. 20 లక్షలు ఇవ్వాలని  ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కంపెనీని బెదిరించిన సంగతి తెలిసిందే..బిల్డర్ ఫిర్యాదు మేరకు బండ్ల విప్లవ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు.