ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దూకుడు..గ్రీన్​కో లో సోదాలు

ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దూకుడు..గ్రీన్​కో లో సోదాలు
  • గ్రీన్​కో ఆఫీసులో ఏసీబీ సోదాలు..
  •  ఫార్ములా–ఈ రేస్‌‌ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్‌‌ ఆపరేషన్స్‌‌ 
  • మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని గ్రీన్‌‌‌‌కోతో పాటు, ఏస్‌‌‌‌ నెక్స్ట్​ జెన్‌‌‌‌ ఆఫీసుల్లోనూ తనిఖీలు
  • మచిలీపట్నంలోని ఏస్‌‌‌‌ అర్బన్‌‌‌‌ రేస్‌‌‌‌, ఏస్‌‌‌‌ అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో కూడా 
  • సెర్చ్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌లో నాలుగు టీమ్స్‌‌‌‌.. హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
  • నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, ఈడీ విచారణకు బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి
  • ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఈడీ సమన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌‌‌‌, ఏపీలోని గ్రీన్‌‌‌‌కో, దాని అనుబంధ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. హైదరాబాద్ హైటెక్‌‌‌‌ సిటీలోని గ్రీన్‌‌‌‌కో కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌ దాని అనుబంధ సంస్థ ఏస్‌‌‌‌ నెక్స్ట్​ జెన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌, ఏపీలోని మచిలీపట్నంలోని ఏస్‌‌‌‌ అర్బన్‌‌‌‌ రేస్‌‌‌‌, ఏస్‌‌‌‌ అర్బన్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌ ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. 

డీఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నాలుగు టీమ్​లు, 27 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు తీర్పు వెల్లడించే సమయానికే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి.హైటెక్‌‌‌‌ సిటీలోని గ్రీన్‌‌‌‌కో ఆఫీస్ సిబ్బంది మొదట సహకరించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు జరిపారు. 

మచిలీపట్నంలోని ఆఫీసుల్లో దాదాపు 10 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ మేనేజర్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేశారు. ఈ తనిఖీల్లో హైటెక్​సిటీలోని గ్రీన్‌‌‌‌కో కార్పొరేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నుంచి పలు హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు.  ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఈవో), ఏస్ నెక్స్ట్ మధ్య అగ్రిమెంట్, మెయిల్స్​ వివరాలు సేకరించారు. 

అలాగే సీజన్ 9కు ముందు, తర్వాత రెండు సంస్థల మధ్య జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్ల వివరాలు తీసుకున్నారు. అలాగే ఏస్ నెక్స్ట్ మేనేజర్​ను బుధవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసు ఇచ్చింది. ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ నిర్వహణలో అప్పటి మున్సిపల్‌‌‌‌ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌కో సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ చలమలశెట్టి అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, జేఎండీ మహేశ్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. 

గ్రీన్​కో సంస్థల నుంచి 2022 ఏప్రిల్‌‌‌‌ 8,9 తేదీల్లో రూ.31 కోట్ల విలువజేసే ఎలక్టోరల్‌‌‌‌ బాండ్స్ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చేరడం ఇందుకు కారణం. ఆ తరువాత గ్రీన్‌‌‌‌కో అనుబంధ సంస్థల నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌10‌‌‌‌‌‌‌‌ తేదీన మరో రూ.10 కోట్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎలక్టోరల్‌‌‌‌ బాండ్స్‌‌‌‌గా వచ్చాయి. ఇలా మొత్తం రూ.41 కోట్లు గ్రీన్‌‌‌‌కో ద్వారా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ అకౌంట్‌‌‌‌లో చేరినట్లు ఏసీబీ గుర్తించింది. 

మరోవైపు 2022 జూన్‌‌‌‌ 29న ఏస్‌‌‌‌ నెక్స్ట్​ జెన్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ఏర్పాటైంది. దీని తరువాతే గ్రీన్‌‌‌‌కో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఫార్ములా–ఈ రేస్‌‌‌‌కు ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఏస్‌‌‌‌ నెక్స్ట్​జెన్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌‌‌ చేసే విధంగా గ్రీన్‌‌‌‌కో వ్యవహరించింది. ఇందుకోసం బ్రిటన్‌‌‌‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌తో ఒప్పందాలు చేసుకుంది.

ఎలక్టోరల్‌‌‌‌ బాండ్స్‌‌‌‌ అందిన 15 రోజుల తరువాత అగ్రిమెంట్‌‌‌‌

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న రెండో విడత ఎలక్టోరల్ బాండ్లు రూ.10 కోట్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చేరాయి. ఆ తరువాత 15 రోజుల వ్యవధిలో 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 25న మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్ అండ్​అర్బన్​డెవలప్​మెంట్(ఎంఏయూడీ), ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌(ఎఫ్‌‌‌‌ఈవో), గ్రీన్‌‌‌‌కో సిస్టర్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఏస్‌‌‌‌  నెక్స్ట్​జెన్‌‌‌‌ మధ్య  త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ సీజన్‌‌‌‌ 9, 10, 11, 12 నిర్వహించేందుకు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. 

ఇందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌‌‌ 9ను నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 10న సీజన్‌‌‌‌ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏస్ నెక్స్ట్‌‌‌‌ జెన్‌‌‌‌ నుంచి ఎఫ్‌‌‌‌ఈవోకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో పాటు అగ్రిమెంట్‌‌‌‌ గడువు ముగిసింది. అయితే సీజన్‌‌‌‌ 10 నిర్వహణ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ నుంచి ఏస్ నెక్స్ట్​ జెన్‌‌‌‌ అనూహ్యంగా తప్పుకుంది. 

ఏస్ నెక్స్ట్​ తప్పుకోవడంతో 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 30న ఎఫ్ఈవో, ఎంఏయూడీ మధ్య కొత్త అగ్రిమెంట్‌‌‌‌ జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్‌‌‌‌కు ముందే అంటే 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3,11 తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డ్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ నుంచి రూ.45.71 కోట్లు బ్రిటన్‌‌‌‌లోని ఎఫ్ఈవో సంస్థకు బదిలీ అయ్యాయి. ఇందుకుగాను హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి మరో రూ.8 కోట్ల 6 లక్షల 75 వేల 404 రూపాయలు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌కు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయ్యాయి.

16న రావాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఈడీ పిలుపు

మనీలాండరింగ్‌‌‌‌ కేసులో కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ విచారణకు హాజరవాల్సి ఉండగా.. ఏసీబీ క్వాష్ పిటిషన్‌‌‌‌ తీర్పు ఉన్నందున సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు మరో చాన్స్​ ఇచ్చారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని మెయిల్‌‌‌‌ ద్వారా సమాచారం అందించారు. 

 ఏసీబీ కేసులో రెండో నిందితుడైన సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అధికారి అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ బుధ వారం ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్‌‌‌‌లోని ఏసీబీ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌కు విచార ణకు హాజరుకానున్నారు.  బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.