వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ...

లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు ఇప్పటికీ మారట్లేదు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. సోదాల్లో ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి..  జూన్​ 13 న జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు వచ్చారు. అనంతరం కార్యాలయంలోని దస్త్రాలు తనిఖీ చేశారు.

ఇటీవలే డీఎంహెచ్​ఓగా విధులు నిర్వహించిన షఫీద్దీన్​ రామగుండానికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే తనిఖీలు జరగడం గమనార్హం. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిని సహకారంతో టైపిస్ట్​ రాజనర్సు ద్వారా వెహికిల్​ టెండర్​ విషయంలో ఓ బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్​గా పట్టుకున్నారు.