
- వస్తువుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో చెకింగ్
ముథోల్, వెలుగు : నిర్మల్ జిల్లా ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్, కాలేజీకి సంబంధించిన వస్తువుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.
కొన్న ఫర్నిచర్, సరుకులు, ఇతర వస్తువుల వివరాలను నమో దు చేసుకున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్, టీచర్లు, లెక్చరర్ల అటెండెన్స్ పరిశీలించారు. కాలేజీకి సంబంధించిన పలు లావాదేవీలపై ఆరా తీశారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐలు సునీల్ గౌడ్, జాన్ రెడ్డి పాల్గొన్నారు.