ప్రభుత్వ ఉద్యోగమా.. మజాకా: 2013లో ఉద్యోగంలో చేరాడు.. ఇప్పుడు ఆస్తి 100 కోట్ల రూపాయలు..!

  • = ఏఈ ఆస్తి100 కోట్లు!
  • = కొలువులో చేరింది 2013వ సంవత్సరంలోనే..
  • = ఏసీబీ సోదాల్లో దిమ్మ తిరిగే నిజాలు
  • = ఏకకాలంలో 20 చోట్ల అధికారుల తనిఖీలు
  • = బంధువుల ఇండ్లలో కొనసాగుతున్న సోదాలు
  • = బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఓ ఇరిగేషన్ ఆస్తులు రూ. 100  కోట్లకు పైమాటే! ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. 20 చోట్ల ఏక కాలంతో సోదాలు నిర్వహించగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. 2013 లో ఉద్యోగం పొందిన ఆయన వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.  నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తున్న నిఖేశ్ కుమార్ ఇంటిపై ఇవాళ ఉదయం ఏసీబీ రెయిడ్ చేసింది. 

ALSO READ : బంగారాన్ని ఎగబడి తాకట్టు పెడుతున్న జనం : ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు

ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో భారీగా వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, కేజీల కొద్ది బంగారం బయట పడినట్టు సమాచారం. అపార్టు మెంట్లు, భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికినట్టు తెలుస్తోంది.  ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.