ఫార్ములా ఈ రేసు కేసులో ఏస్ నెక్స్ట్ కంపెనీకి ACB నోటీసులు

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులను విచారించిన ఏసీబీ.. తాజాగా ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఏస్ నెక్ట్స్ కంపెనీతో పాటు గ్రీన్ కో సంస్థ ఎండీ అనిల్‎కు సైతం ఏసీబీ సమన్లు పంపింది. 2025, జనవరి 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో  ఆదేశించింది. హైదరాబాద్‎లో ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి ఒప్పందం చేసుకుని ఉన్నట్టుండి ఎస్ నెక్ట్స్‌ కంపెనీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. 

ALSO READ | పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ 2 పిటీషన్లు

ఎస్ నెక్ట్స్‌ ఉన్న ఫలంగా ఎందుకు ఒప్పందం నుండి తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై ఏసీబీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. -గ్రీన్ కో, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఫార్ములా ఈ ఒప్పందంపై ఏసీబీ క్వశ్చన్ చేయనున్నట్లు టాక్. ఫార్ములా ఈ కేసులో ప్రధాన నిందితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ ప్రశ్నించింది. వీరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన ఏసీబీ.. వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపట్టనుంది.