ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్​కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్​కు ఏసీబీ నోటీసులు
  • –ఈడీ కంటే ముందే ఏసీబీ విచారణ
  • 8న రావాలని అర్వింద్ కుమార్​కు, 10న రావాలని బీఎల్ఎన్ రెడ్డికీ నోటీసులు
  • ఎంఏయూడీ, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈవోఒప్పందాలపై ఆరా తీసే అవకాశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా–ఈ రేస్‌‌‌‌ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) కంటే ముందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను విచారించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. సోమవారం (ఈ నెల 6న) ఉదయం 10.30కు తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈ మేరకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేసులో రెండో నిందితుడు సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌ కు 8వ తేదీన, మూడో నిందితుడు హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్ఎన్ రెడ్డికి 10వ తేదీన విచారణకు రావాలనీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్‌‌‌‌ ఆఫ్ మనీలాండరింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌(పీఎంఎల్‌‌‌‌ఏ) కింద ఈడీ ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది. దీనికి సంబంధించి 7వ తేదీన కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు అన్నీ నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ కావడంతో కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ పూర్తికాగా, తీర్పు రిజర్వులో ఉంది. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేయకుండానే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సమన్లు జారీ చేసింది. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలతోనే కొత్త అగ్రిమెంట్

ఎంఏయూడీ, ఎఫ్‌‌‌‌ఈవో ఆధ్వర్యంలో సీజన్‌‌‌‌ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌‌‌‌ను 2023 సెప్టెంబర్‌‌‌‌లో అప్పటి మున్సిపల్‌‌‌‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు అప్పటి హెచ్‌‌‌‌ఎండీఏ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌ అందించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌‌‌10‌‌‌‌న మరో కొత్త ఒప్పందం జరిగింది. ఈవెంట్‌‌‌‌ నిర్వహణ కోసం స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ ఫీజు, ట్యాక్స్‌‌‌‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు చెల్లించాలని అగ్రిమెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్‌‌‌‌, సివిల్‌‌‌‌ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసేలా అండర్‌‌‌‌ ‌‌‌‌టేకింగ్‌‌‌‌ తీసుకున్నారు. ఇలా హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.160 కోట్లు అప్రూవల్ శాంక్షన్ చేసేలా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలతోనే ఒప్పందం జరిగిందని ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 

ALSO READ : అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !

కోడ్‌‌‌‌ ఉండగానే రూ.54 కోట్లు దుర్వినియోగం

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారు. 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3, 11వ తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌‌‌‌లోని ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌కు తరలించారు. ఇందుకుగాను ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్‌‌‌‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు ఫెడరేషన్ ఆఫ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌‌‌ఐఏ)కు రూ.1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి  మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ దుర్వియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు,హెచ్‌‌‌‌ఎండీఏ రికార్డులను ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. అగ్రిమెంట్లు, నిధుల చెల్లింపుల డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించనున్నారు.