80వేలు లంచం డిమాండ్: ACBకి చిక్కిన GHMC అధికారులు

80వేలు లంచం డిమాండ్: ACBకి చిక్కిన GHMC అధికారులు

ఈస్ట్ జోన్ GHMCకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ కి చిక్కారు. ఎల్బీనగర్ బిల్ కలెక్టర్ పోచయ్య కొత్త పేట న్యూ మారుతి నగర్ లోని ఓ భవన యజమాని నుంచి.. ఇంటి బిల్లు తగ్గించడానికి 80 వేలను డిమాండ్ చేశారు. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇంటి యజమాని కొంత నగదు, బ్యాంక్ చెక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  విచారణలో ఇన్స్పెక్టర్ రవి ప్రసాద్ పేరు వెల్లడించాడు పోచయ్య. దీంతో రవి ప్రసాద్ ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటే పలు ఫైళ్ల కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు.