- ఔట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇచ్చేందుకు రూ. 10 వేలు డిమాండ్
- రూ.2 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు
ఇల్లెందు, వెలుగు : ఔట్ సోర్సింగ్ టీచర్‌కు జీతం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఓ ప్రిన్సిపాల్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... సంధ్యారాణి అనే మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని మైనార్టీ గురుకుల స్కూల్‌లో ఔట్ సోర్సింగ్ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఈ నెల జీతం ఇచ్చేందుకు ప్రిన్సిపాల్ బి.కృష్ణ రూ. 10 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో ఆ టీచర్ రూ. 2 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తర్వాత ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేసింది. వారి సూచనలతో గురువారం ఉదయం స్కూల్‌లో అటెండర్ రామకృష్ణకు రూ. 2 వేలు ఇవ్వగా అతడు ప్రిన్సిపాల్ కృష్ణకు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.