ఆదిలాబాద్ లో ఏసీబీకి చిక్కిన డీఈ..రూ. 2లక్షలు లంచం డిమాండ్ చేసి బుక్కయ్యాడు

ఆదిలాబాద్ లో ఏసీబీకి చిక్కిన డీఈ..రూ. 2లక్షలు లంచం డిమాండ్ చేసి బుక్కయ్యాడు

ఆదిలాబాద్ లో విద్యా మౌలికవసతుల డీఈగా విధులు నిర్వహిస్తున్న శంకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షలు డిమాండ్ చేసిన శంకర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంగళవారం ( మార్చి 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ మైనారిటీ బాలికల కళాశాలకు రెండు కోట్లు మంజూరు కాగా.. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ దగ్గర డీఈ శంకర్ రూ. 2లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

రెండు లక్షలు లంచం డిమాండ్ చేసిన శంకర్ తో రూ. లక్ష కు ఒప్పందం కుదుర్చుకున్నారు కాంట్రాక్టర్. అందులో మొదటి విడతగా రూ. 50వేలు చెల్లిస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. శంకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ( మార్చి 12 ) కరీంనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని.. లంచం ఇచ్చి అవినీతి అధికారులను ప్రోత్సహించద్దని కోరుతున్నారు ఏసీబీ అధికారులు.