జగిత్యాల జిల్లా మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెట్ పల్లి మండలం మేడిపల్లికి చెందిన బద్దం శంకర్ రెడ్డి అనే రైతు వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్ఐ తిరుపతి అడ్డంగా దొరికిపోయాడు. తన ఏడు గుంటల వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం బద్దం శంకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు.
ఇందుకోసం ఆర్ఐ తిరుపతి లంచం డిమాండ్ చేశాడు. రూ.15 వేలకు ఒప్పందం జరిగింది. ఆర్ఐ తిరుపతికి లంచం ఇవ్వడం ఇష్టం లేక రైతు శంకర్ రెడ్డి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే శంకర్ రెడ్డి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్ఐ తిరుపతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.