సినీ ఫక్కీలో అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్

సినీ ఫక్కీలో అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్

మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజ మల్లయ్య, సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో ఓ స్థలం విషయంలో గత కొంతకాలంగా రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణకు, సుదర్శన్కు మధ్య వివాదం నడుస్తుంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించినట్లు బాధితుడు చెప్పాడు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజ మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా మున్సిపల్ కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు.

రూ.50 వేలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్కు సుదర్శన్ 20 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు సుదర్శన్ నుంచి మున్సిపల్ కార్యాలయంలో 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ ఎస్ రాజ మల్లయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో మున్సిపల్ అధికారుల పాత్ర ఉందని అధికారులను ఏసీబీ అధికారులు  విచారిస్తున్నారు.