నెల రోజుల్లో 20 మంది అవినీతి అధికారుల అరెస్టు

నెల రోజుల్లో 20 మంది అవినీతి అధికారుల అరెస్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది ప్రారంభం నుంచి జనవరి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. అధికారుల నుంచి రూ.1.45లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పోలీసులు సహా వివిధ శాఖలకు చెందిన మొత్తం 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ముగ్గురు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

 ఈ మేరకు సోమవారం ఏసీబీ డీజీ విజయ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాప్ కేసులతో పాటు అవినీతి అధికారులపై ఒక ఆదాయానికి మించిన కేసు, 3క్రిమినల్ మిస్ కండక్ట్, 3 రెగ్యులర్ ఎంక్వైరీ కేసులు, మరో మూడు డిస్క్రీట్ ఎంక్వైరీ కేసులను నమోదు చేశామని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన ఆరోపణలపై గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగిని జగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి వద్ద రూ.65.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అధికారులపై ఏసీబీ టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1064కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.