16 లక్షల చెక్కు విడుదల కోసం రూ.50వేల డిమాండ్ 

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ  దాడుల్లో 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ డీఈ నవీన్ కుమార్, ఏఈ హాబీబ్ ఖాన్ పట్టుబడ్డారు. మేడారం ఆల‌య కాంట్రాక్టు ప‌నులకు చెందిన రూ.16 ల‌క్షల చెక్కును  విడుద‌ల చేయ‌డానికి వీరు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులకు డీఈ నవీన్ కుమార్, ఏఈ హాబీబ్ ఖాన్ పట్టుబడ్డారు.