లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి

లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి
  • సరికొత్త నినాదంతో ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
  • ఈ నెల 9 వరకు అవగాహన కార్యక్రమాలు
  • పోస్టర్ ఆవిష్కరించిన డీజీ విజయ్‌‌కుమార్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ‘‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి..’’ అనే నినాదంతో వారం రోజుల పాటు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారోత్సవాల పోస్టర్‌‌ను ఏసీబీ డీజీ విజయ్‌‌కుమార్‌‌ మంగళవారం విడుదల చేశారు. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రేంజ్‌‌లలోని ఏసీబీ కార్యాలయాల్లో డీఎస్పీలు, కలెక్టర్లతో పోస్టర్లు ఆవిష్కరించనున్నారు. ఏసీబీ టోల్‌‌ఫ్రీ నంబర్‌‌ 1064, ఏసీబీ రేంజ్‌‌ల వారీగా ఏసీబీ అధికారుల ఫోన్‌‌ నంబర్లు ఉన్న పోస్టర్లను కలెక్టర్‌‌ కార్యాలయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ప్రదర్శిస్తారు. 

బుధవారం అన్ని జిల్లాల్లో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు, ఇంటర్‌‌ స్టూడెంట్స్​కు వ్యాసరచన పోటీలు, ఈ నెల 5, 6 తేదీల్లో రేంజ్‌‌ డీఎస్పీ కార్యాలయాల్లో అవగాహన ర్యాలీలు, నిందితులకు శిక్షపడిన ఏసీబీ కేసుల్లోని ఫిర్యాదుదారులకు 7న సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.