ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌ కేసు.. నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం!

ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌ కేసు.. నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌‌‌‌ అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు తొలి నోటీసు ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్‌‌‌‌ తీసుకొని ముందుకెళ్తున్నది. ముందస్తుగా అరవింద్‌‌‌‌ కుమార్ సహా పలువురు మున్సిపల్‌‌‌‌ శాఖ అధికారులకు నోటీసులిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అధికారులు ఇచ్చే స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగా మాజీ మంత్రికి నోటీసులిచ్చి విచారించనున్నది. గతేడాది ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌కు నిర్వహణకు విదేశీ కంపెనీలకు రూ.55 కోట్లు చెల్లించారని ఇప్పటికే మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్(ఎమ్‌‌‌‌ఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ సమక్షంలోనే నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే సీఎస్ శాంతి కుమారికి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ వెల్లడించిన వివరాలతో బాధ్యులైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.