ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తహసీల్దార్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఓ పెట్టేలో దాచి ఉంచిన దాదాపు రూ.2 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read :- తెలంగాణాలో దసరా, బతుకమ్మ సెలవులు..మొత్తం ఎన్ని రోజులంటే
అదేవిధంగా భారీ మొత్తంలో బంగారం, సహా పలు ఆస్తుల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. తహసీల్దార్ మహేందర్ రెడ్డి స్వస్థలం ఇబ్రహీంపట్నం. మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇటీవలే కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి బదిలీపై వచ్చారు.