నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 43 లక్షల 54 వేల రూపాయల అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
9 లక్షల 12 వేల రూపాయల విలువ చేసే బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కామారెడ్డి సీఐగా పనిచేసిన జగదీష్.. 2020 లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రెండేళ్లుగా జగదీష్ సస్పెన్షన్లో ఉన్నారు.