ఇరిగేషన్ మాజీ ENC హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇరిగేషన్ మాజీ ENC హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

 తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 26న ఉదయం నుంచే షేక్ పేటలోని  ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంట్లో  ACB సోదాలు చేస్తోంది.  హరి రామ్ ఇంటి తోపాటు 14చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో హరిరాం  కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేశారు.

ఎన్డీఎస్ ఏ  రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది.  రెండు రోజుల క్రితమే ఎన్డీఎస్ ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.  నివేదికలో  హరిరాంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది ఎన్డీఎస్ ఏ. కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున  అవినీతి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏసీబీ సోదాలు చేస్తోంది. 

మేడిగడ్డ డిజైన్లకు అనుమతుల్లేవు..

మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు, క్లియరెన్సులు లేవని ఎన్‎డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై సీడీవో ఇచ్చిన పలు డ్రాయింగ్‏లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయనేలేదని, అది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది.