ఘట్కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. అడ్డంగా బుక్కైన ఏఈ, లైన్ మెన్

ఘట్కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. అడ్డంగా బుక్కైన ఏఈ, లైన్ మెన్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారులపై యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఉక్కు మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడి వాలిపోయి.. అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ఈ క్రమంలోనే 2024, నవంబర్ 26వ తేదీన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక రైడ్స్ చేశారు. 

ఓ వ్యక్తి నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్‎ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. బాధితుడి నుండి ఎందుకు లంచం డిమాండ్ చేశారు.. ఎంత డిమాండ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘట్కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | జీడిమెట్ల ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం