మహబూబాబాద్ : ఆడిట్ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు సోదాలు చేస్తున్నారు. జూనియర్ ఆడిట్ ఆఫీసర్ శ్రీను.. జానియర్ అసిస్టెంట్ కిశోర్ రూ.18,000 లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో .. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
బృందాలుగా ఏర్పడిన అధికారులు రికార్డులు తనిఖీ చేయడంతో పాటు.. నిందితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిన జూనియర్ ఆడిట్ ఆఫీసర్ శ్రీను, జూనియర్ అసిస్టెంట్ కిశోర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇరువురు నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించే అవకాశముంది.