హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.45 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డి పట్టుబడ్డాడు. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన కేతావత్ రమేష్ తన టిప్పర్ వాహనానికి ఎస్సీ ఎస్టీ కోటా కింద గవర్నమెంట్ స్కీం వర్తింపు చేయాలని అధికారులను కోరాడు.
దీనికోసం వారు లంచం డిమాండ్ చేశారు. దీంతో రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటుండగా జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.