జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే గురువారం (అక్టోబర్ 24) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఈఈ దిలీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. కాగా, రోడ్డు పనుల బిల్లు మంజూరు కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశాడు ఈఈ దిలీప్.
ALSO READ | వన్ పోలీస్ వన్ రూల్ అమలు చేయండి..
దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు అవినీతి అధికారి భరతం పట్టేందుకు ఏసీబీ పక్కా వ్యూహాం రచించింది. ప్లాన్‌లో భాగంగా ఇవాళ కాంట్రాక్టర్ అధికారికి లంచం ఇస్తుండగా సడన్ ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు.. రూ.20వేల లంచం తీసుకుంటుండగా దిలీప్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ ముమ్మరంగా సోదాలు నిర్వహించింది.