మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

గండిపేట, వెలుగు : మణికొండ మున్సిపల్‌  ఆఫీసులో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డీఈఈ దివ్యజ్యోతి లంచాలు తీసుకుంటోందంటూ ఆమె భర్త ఫిర్యాదుతో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై మంగళవారం ఆరా తీశారు.

దివ్యజ్యోతి సంతకం పెట్టిన ఫైల్స్​ను వెంట తీసుకెళ్లారు. మణికొండ మున్సిపల్ కమిషనర్ ను, ఏఈని సైతం విచారించినట్లు తెలిసింది. దివ్యజ్యోతి మణికొండలోని ఓ అపార్ట్​మెంట్​లో రూ.1.20కోట్లతో ప్లాట్ కొన్నట్లు సమాచారం.