హడలెత్తించిన ఏసీబీ దాడులు లంచగొండి ఆఫీసర్లు, సిబ్బందిపై నజర్

హడలెత్తించిన ఏసీబీ దాడులు లంచగొండి ఆఫీసర్లు, సిబ్బందిపై నజర్
  • 10 కేసులు నమోదు.. ఇద్దరికి జైలు
  • అవినీతిలేని పౌర సేవలు పొందేలా కొత్త ఏడాదిలో పక్కా ప్లాన్​తో ముందుకు
  •  ప్రజలలో విస్తృత ప్రచారానికి ప్లాన్​

నిజామాబాద్, వెలుగు:నిజామాబాద్​ నగర పాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్​ (ఆర్వో) దాసరి నరేందర్​ ఇంటిపై  2024 ఆగస్టు 9న నిర్వహించిన రైడ్​లో రూ.2.93 కోట్ల నగదు​తో పాటు మార్కెట్​ విలువ ప్రకారం స్వాధీనం చేసుకున్న సుమారు రూ.25 కోట్ల విలువైన ప్రాపర్టీ సీజ్​ చేశారు. దాడి సమాచారం లీక్​ కాకుండా  జాగ్రత్తలు తీసుకొని సక్సెస్​ అయ్యారు.  ఈ ఒక్కదాడి తరువాత మున్సిపల్​ కార్పొరేషన్​ పాలన​లో చాలా మార్పులు జరిగాయి. 

మరికొన్ని దాడుల్లో


జనవరి 8న కామారెడ్డి సబ్​స్టేషన్​లో సంతోష్​ ​అనే వ్యక్తి అద్దెకు పెట్టిన వెహికల్​ బిల్లు శాంక్షన్​ చేయడానికి  ఏఈ సాయినిరాజు రూ.12.500 లంచం డిమాండ్​ చేసి రెడ్​హ్యాండెడ్​గా చిక్కాడు.

ఫిబ్రవరి 5న జక్రాన్​పల్లి మండలం తొర్లికొండ వాసి నిఖిల్​కు ఇంటి ఓనర్​ షిప్​ సర్టిఫికేట్​ఇవ్వడానికి రూ.4 వేలు లంచంగా తీసుకుంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీ మనోహర్​ ఏసీబీకి దొరికి జైలుకు వెళ్లాడు.

మార్చి 26న  కమ్మర్​పల్లి మండల పరిషత్​ ఆఫీస్​ ఉద్యోగి రావుట్ల బాగయ్య సర్వీస్​ బుక్​ సవరించడానికి ఎంపీడీవో సంతోష్​రెడ్డి తరపున రూ.8 వేల లంచం తీసుకుంటూ సీనియర్​ అసిస్టెంట్​ హరిబాబు పట్టుబడగా ఇద్దరిపై కేసు నమోదుకావడంతో జైలు శిక్షపడింది.  

ఏప్రిల్​30న ఆర్మూర్​ కోర్టులో ఒక కేసుకు సంబంధించి సెల్​ఫోన్​ రిటర్న్​ చేయడానికి వెంకటేశ్వర్​ అనే ఉద్యోగి రూ.4 వేలు డిమాండ్​ చేయగా ఏసీబీ ఆఫీసర్లు కేసు నమోదు చేశారు.

మే 28న బోధన్​ మండలం సాలూరా ఇంటిగ్రేటెడ్​ చెక్​పోస్ట్​పై ఆకస్మిక దాడి  చేసి క్యాష్​బుక్​లో ఎంటర్​ చేసినదానికంటే ఎక్కువ నగదు కలిగి ఉన్న కంప్యూటర్​ ఆపరేటర్​ చైత్రిస్వామిపై ప్రభుత్వానికి రిపోర్ట్​ చేశారు. 


ఆగస్టు 13న నగరంలోని కోటగల్లీ ఎస్సీ గర్ల్స్​ హాస్టల్​పై సడన్ రైడ్ చేసి నిర్వహణ లోపాలపై సర్కారుకు నివేదిక పంపారు. 

సెప్టెంబర్​12న నందిపేటలో ఇంటి నిర్మాణ పర్మిషన్​ కోసం సంతోష్​ అనే వ్యక్తి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ విలేజ్​ సెక్రటరీ నవీన్​కుమార్​ రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయాడు.
 

నవంబర్​ 8న వర్ని ఎస్ ఐ కృష్ణకుమార్​స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి నాగరాజ్​నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తూ చిక్కి జైలుపాలయ్యాడు.
 
నవంబర్​14న లింగంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఒక కేసుకు సంబంధించి రూ.10 లంచం తీసుకుంటూ ఎస్ఐ అరుణ్, కానిస్టేబుల్​రామస్వామి ఏసీబీకి పట్టుబడ్డారు.

ఇద్దరికి జైలు శిక్ష

2012లో సీసీ రోడ్​పనుల ఎస్టిమేషన్​ఇవ్వడానికి కంట్రాక్టర్ అరవింద్​ నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన మున్సిపల్​ కార్పొరేషన్​ ఏఈ అశోక్ కు​శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించారు.  కోర్టు అతడికి రెండేండ్ల జైలు శిక్ష, రూ.40 వేల ఫెనాల్టీ విధించింది.

మాక్లూర్​ సబ్​స్టేషన్​ ఏఈ సదాశివ్​ ట్రాన్స్​ఫార్మర్​శాంక్షన్​ చేయడానికి రైతు శ్రీనివాస్​రెడ్డి నుంచి 2008లో రూ.3 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కోర్టు అతడికి ఏడాది జైలు, రూ.20 వేల జరిమానా విధించింది.

నిబద్ధతతో  డ్యూటీ చేస్తున్నం

సర్కారు ఆఫీస్​ల్లో కరప్షన్​లేని సర్వీస్​లు పౌరులకు అందాలనే నిబద్ధతతో పనిచేస్తున్నం. అవినీతిపరుల ఇన్ఫర్మేషన్​ పొందడానికి మేము పాటించే​ విధానాలు ఫలితాలిస్తున్నాయి. పౌరులు కూడా సహకరిస్తున్నారు.  2022, 2023  కంటే 2024లో  కేసులు పెరిగాయి. కొత్త ఏడాదిలో కూడా అంకితభావంతో పనిచేసి రిజల్టు చూపుతాం. మా సేవలు పొందడానికి టోల్​ఫ్రీ నంబర్ 1064, సెల్​ఫోన్​ 91543 88950,  91543 88951, 91543 88953, 91548 88928 లో సంప్రదించాలి-  శేఖర్​గౌడ్​, డీఎస్పీ, ఏసీబీ ఉమ్మడి జిల్లా