వైసీపీకి షాక్: మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు.. 

ప్రతిపక్ష వైసీపీకి మరో షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు సర్కార్ మాజీ మంత్రి జోగి రమేష్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ( ఆగస్టు 13, 2024 ) విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో భారీగా అక్రమాలతో పాటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.జోగి రమేష్  అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను ఆయన కోనుగోలు చేసి, విక్రయించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే.