హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం(ఫిబ్రవరి 07) హన్మకొండలోని ఆయన అద్దె ఇంటితో పాటు, జగిత్యాల, హైదరాబాద్‌లోని వారిబంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల ఈ సోదాలు జరిగాయి. కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
ఏసీబీ అధికారులు సోదాల్లో భారీ ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. పుప్పాల శ్రీనివాస్ రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు ప్రాథమికంగా కనుగొన్నారు.
- హైదరాబాద్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు
- జగిత్యాల, కరీంనగర్‌లో భూములు
- వరంగల్‌లో పెద్ద ప్లాట్లు
- బ్యాంక్ ఖాతాల్లో భారీగా డబ్బు
- ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు
NGO నుండి అవార్డు
ఇదిలావుంటే, పుప్పాల శ్రీనివాస్ ఒక ఎన్జీఓ సంస్థ నుండి అవార్డు అందుకోవడం కొసమెరుపు. ఈయన ఆదిలాబాద్ జిల్లా రవాణా కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో.. రోడ్డు భద్రతా రంగంలో ఆయన చేసిన కృషికిగానూ OHSSAI ఎన్జీఓ సంస్థ నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.