హైదరాబాద్ : హైదరాబాద్లోని హాస్టల్స్ పై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. BC, SC, ST సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజాము 5 గంటల నుంచే ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
అలాగే సిటీలోని వివిధ సంక్షేమ వసతి గృహాలపై దాడులు చేశారు. బీసీ, ఎస్సీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అందుతున్న వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్ తనికీలు చేశారు. మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.