ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి డీఈఓ

సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీకి చిక్కాడు. మార్చి 24న సంగారెడ్డి పరధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ స్యూల్ కు ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలని డీఈఓ రాజేష్ ను కోరారు. అయితే ఎన్ఓసీ ఇవ్వడానికి ఒప్పుకున్న.. డీఈఓ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు సంగారెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారుల సూచనల మేరకు బాధితులు శుక్రవారం డీఈఓ ఆఫీసులో రూ.50 వేలు లంచం ఇస్తుండగా.. రాజేష్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. "మార్చి15న ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది.  సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ స్కూల్ SSC సిలబస్ నుంచి ICSE కి అప్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్ గ్రేడ్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరిపింది. స్కూల్ NOC కోసం రూ. లక్షా 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత 60 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక స్కూల్ యాజమాన్యం ACB ని ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, DEO రాజేష్ లు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది" అని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వివరించారు. కేసు నమోదు చేసి డీఈఓని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.