
ఈ మధ్య ప్రభుత్వ అధికారులు, పోలీసులపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది. అవినీతికి పాల్పడుతోన్న అధికారులను అడ్డంగా పట్టుకుంటోంది. లేటెస్ట్ గా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఓ కేసు విషయంలో బాధితుడితో రూ. 2 లక్షల లంచానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పక్కా స్కెచ్ తో ఏప్రిల్ 28న శామీర్ పేట పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఏసీబీ అధికారులు ఎస్ఐ పరశురామ్ బాధితుడి నుంచి రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మూడు వాహనాల్లో పోలీసు స్టేషన్ కు వచ్చిన ఏసీబీ అధికారులు శామీర్ పేట్ SI పరశురామ్ -ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ స్టేషన్ ను తమ స్వాధీనంలోకి తీసుకుని తనీఖీలు చేస్తున్నారు అధికారులు.
ఎస్ఐ పరశురామ్ బాధితుల నుంచి విడతల వారిగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శామీర్ పేట్ ఎస్ఐ, సీఐతో పాటు పెట్ బషీరాబాద్ ఏసీపీ రాములును కూడా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. చాలా మంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి. మరికొందరు పై అధికారులను కూడా ఏసీబీ విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.