హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈఈ నికేష్‌కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తోంది. శనివారం (నవంబర్ 30) హైదరాబాద్‌తో పాటు ఏకకాలంలో 20 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నికేష్ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.
గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టుకున్నట్లు ఏఈఈ నికేష్ కుమార్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. నికేష్ కుమార్ పేరిట నగర శివార్లలో మూడు ఫాం హౌస్‌లు, మూడు విల్లాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం మెదక్, హైదరాబాద్, సంగారెడ్డిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.