రూ.80 వేల లంచంతో దొరికిన సబ్ రిజిస్ట్రార్

రూ.80 వేల లంచంతో దొరికిన సబ్ రిజిస్ట్రార్

తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. సునీత అనే ఉద్యోగిని సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పనిపై ఆఫీసుకు వచ్చారు. పని చేయటానికి 80 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్. దీంతో శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 

ALSO READ | ఇనుపరాతి గుట్టలు  ఎవరి‘పట్టా’నో.. ఫారెస్ట్ భూములపై ఎడతెగని పంచాయితీ 

పక్కా ప్లాన్ ప్రకారం.. ఏసీబీ అధికారుల సూచనలతో సబ్ రిజిస్ట్రార్ సునీత్ అడిగిన 80 వేల రూపాయలు ఇవ్వటానికి శ్రీకాంత్ ఓకే చెప్పాడు. ఈ క్రమంలోనే 2024, జూలై 25వ తేదీ ఉదయం 80 వేల రూపాయలు లంచం డబ్బు తీసుకుంటుండగా మధ్యవర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ చేయగా.. సబ్ రిజిస్ట్రార్ సునీతగారు పేరు చెప్పాడు అతను. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆఫీసులోనే తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ గతంలో చేసిన రిజిస్ట్రేషన్లపైనా ఆరా తీస్తున్నారు. పాత రికార్డులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ తనిఖీలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఉద్యోగులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.