
ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝులిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, పోలీసులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటున్నారు. ఓ కేసు విషయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ వేసిన ఏసీబీ అధికారులు సీఐ,ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు. నారాయణ పేట జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది.
Also Read :- శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
నారాయణపేట మక్తల్ లో సీఐ,ఇద్దరు కానిస్టేబుళ్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో 20 వేలు లంచం తీసుకుంటూ మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు శివరెడ్డి, నరసింహ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు,సీఐని అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రశేఖర్ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. బాధితుడి నుంచి తీసుకున్న డబ్బును రికవరీ చేసింది.
మరో వైపు లంచంతీసుకుంటుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొమరారం రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఏసీబీకి చిక్కారు. ఫారెస్ట్ భూమి నుంచి గ్రావెల్ తోలుకునేందుకు ఓ వ్యక్తిని 30వేల రూపాయలు డిమాండ్ చేయగా.. ఏసీబీని ఆశ్రయించాడు కాంట్రాక్టర్. దీంతో పక్కా ప్లాన్ వేసిన ఏసీబీ.. బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ రేంజర్ ను పట్టుకుంది.